Homeఎక్స్ క్లూసివ్ఆ హీరో మళ్ళీ దెబ్బతిన్నాడు

ఆ హీరో మళ్ళీ దెబ్బతిన్నాడు

Another flop for Nikhil kumar gowda కన్నడ హీరో నిఖిల్ కుమార్ గౌడ హీరోగా ఎంట్రీ ఇస్తూనే భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది . హీరోగా నటించిన మొదటి చిత్రం జాగ్వార్ అట్టర్ ప్లాప్ అయ్యింది . తెలుగు , కన్నడ బాషలలో రిలీజ్ అయ్యింది ఆ చిత్రం . భారీ బడ్జెట్ చిత్రం ప్లాప్ కావడంతో రెండో చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయకుండా కన్నడంలో మాత్రమే రిలీజ్ చేసారు ” సీతారామ కల్యాణ ” చిత్రాన్ని.

సీతారామ కల్యాణ చిత్రం ఈనెల 25 న భారీ ఎత్తున కన్నడంలో విడుదల అయ్యింది , అయితే ఈ సినిమా కన్నడ ప్రేక్షకులను అలరించలేక పోతోంది పాపం . దాంతో నిఖిల్ రెండో సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరేలా కనిపిస్తోంది . ఊర మాస్ చిత్రంగా రిలీజ్ అయిన సీతారామ కల్యాణ చిత్రంలో కొత్తదనం ఏమి లేకపోవడంతో ప్రేక్షకులు నిఖిల్ చిత్రాన్ని ఆదరించడం లేదు . కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడే ఈ నిఖిల్ గౌడ అన్న విషయం అందరికీ తెలిసిందే .

- Advertisement -

English Title: Another flop for Nikhil kumar gowda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All