Homeటాప్ స్టోరీస్మరో అడల్ట్ సినిమా వస్తోంది

మరో అడల్ట్ సినిమా వస్తోంది

another adult movie natakamరొమాన్స్ , లిప్ లాక్ లు , కౌగిలింతల సినిమాలు హిట్స్ అవుతుండటంతో ఆ చిత్రాల జోరు ఎక్కువయ్యింది , ఇప్పటికే ఆర్ ఎక్స్ 100 చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే కాగా తాజాగా అదే జోనర్ లో రూపొందిన చిత్రం ” నాటకం ”. ఆశిష్ గాంధీ – ఆషిమా జంటగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ గోగణ దర్శకత్వం వహించాడు . కాగా ఈ చిత్ర ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు . యాక్షన్ తో పాటు ఘాటు లిప్ లాక్ లు , శృంగార సన్నివేశాలు చాలానే ఉన్నాయి నాటకం చిత్రంలో .

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ ఉంది అయితే దానికంటే ఎక్కువగా రొమాన్స్ ఉండటంతో అడల్ట్ సినిమాగా తేలిపోయింది . ఇక అలాంటి సినిమాలకు టికెట్లు కూడా బాగానే తెగుతుండటంతో కాబోలు ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి అయితే అలా వస్తున్న అన్ని సినిమాలు ఆడటం లేదు ,కానీ రొమాన్స్ ని క్యాష్ చేసుకుందామని భావించేవాళ్ళు ఇలా చేస్తున్నారు . కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు లేదంటే రష్మీ సినిమాల్లాగే ఇది కూడా అంతే !

- Advertisement -

English Title: another adult movie natakam

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All