Homeన్యూస్బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఎన్నీ

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఎన్నీ

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఎన్నీ
బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఎన్నీ

బిగ్ బాస్ సీజన్ 5 లో పదకొండో వారం ముగుస్తోంది. ఇప్పటికే 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. పదకొండో కంటెస్టెంట్ ఈరోజు హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతారు. ఆ వ్యక్తి ఎవరన్నది ముందే తెలిసిపోయింది. బిగ్ బాస్ లో మొదటి నుండి కూడా ఎలిమినేట్ అయిన వ్యక్తుల నుండి టాస్క్ ల విషయంలో సమాచారం కూడా ముందే తెలిసిపోతోంది. దీని ప్రకారంగా ఈరోజు ఎన్నీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వనున్నట్లు సమాచారం.

ఈ వారానికి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వగా అందులోనుండి నిన్న ఇద్దర్ని బిగ్ బాస్ సేవ్ చేసాడు. శ్రీరామ్ చంద్ర, సన్నీ నిన్నటి ఎపిసోడ్ లో సేవ్ అయ్యారు. ఇంకా ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. కాజల్, సిరి, ఎన్నీ, ప్రియాంక, షణ్ముఖ్, మానస్ లు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో నుండి ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ చివరికి ఎన్నీ మాస్టర్ ను ఎలిమినేట్ చేసారు.

- Advertisement -

గత కొన్ని వారాలుగా ఎన్నీ మాస్టర్ గేమ్ ప్లే స్లో డౌన్ అయింది. అలాగే ఆమె హౌజ్ లో పలువురిని ఎక్కిరించడం, మాటిమాటికీ గట్టిగా అరవడం వంటివి ఆమెకు ప్రతికూలంగా మారాయి. ఇక సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది. దాని ప్రకారం తను కానీ తనకు క్లోజ్ ఉన్న వ్యక్తులు కానీ ఎలిమినేట్ అవుతారు అనుకున్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ సన్నీ, ఎన్నీ కోసం దాన్ని ఉపయోగించుకోవాలి అనుకోలేదు.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ 5 ప్రియాకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ 5 : నామినేషన్స్ లో ఆ ఆరుగురు..!

బిగ్ బాస్ 5 : ప్రియ ఎలిమినేషన్ తో ప్రూవ్ అయిన సన్నీ స్టామినా..!

బిగ్ బాస్ 5 : నటరాజ్ మాస్టర్ కు ఎంత ఇచ్చారు..?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All