
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోందంటే ఆ హంగామానే వేరు. తరాలు మారుతున్నా రజినీకాంత్ క్రేజ్ కు వచ్చిన ఢోకా ఏం లేదు. రీసెంట్ గా రజినీ ఫినిష్ చేసిన సినిమా అన్నాత్తే. ఈ సినిమా దీపావళికి విడుదల కానుందని అధికారికంగా వెల్లడించారు. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే సినిమా ప్రమోషన్స్ ను కూడా భారీ లెవెల్లో చేపట్టారు.
ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ సాంగ్ సూపర్ హిట్ అయింది. లేట్ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆఖరి పాట కావడంతో ప్రేక్షకులు మరింత ఆసక్తితో ఈ పాటను వింటున్నారు. ఇదిలా ఉంటే అన్నాత్తే మొదటి టీజర్ ను దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు.
అక్టోబర్ 14న సాయంత్రం 6 గంటలకు ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇంకా తెలుగు వెర్షన్ కు సంబంధించి ప్రమోషన్స్ మొదలుకాలేదు. టాలీవుడ్ లో కూడా రజినీకాంత్ కు ఇక్కడి స్టార్ హీరోలకు సమానమైన మార్కెట్ ఉంది. ప్రతీ రజినీకాంత్ సినిమా అంతే బజ్ తో తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతుంది. అన్నాత్తే తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ ను త్వరలోనే మొదలుపెడతారు.
శిరుతై శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. డి. ఇమ్మాన్ సంగీతం అందించాడు. నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషించారు.
The much AWAITED #AnnaattheTeaser on Oct 14 at 6 pm.#Rajinikanth #Annaatthe pic.twitter.com/3NBp2tUznY
— Manobala Vijayabalan (@ManobalaV) October 11, 2021