Homeటాప్ స్టోరీస్అంజలికి ప్రస్తుతం ఈ మూడ్ లేదట

అంజలికి ప్రస్తుతం ఈ మూడ్ లేదట

అంజలికి ప్రస్తుతం ఈ మూడ్ లేదట
అంజలికి ప్రస్తుతం ఈ మూడ్ లేదట

ఈ లాక్ డౌన్ సమయంలో పలువురు సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని తమ జీవితంలో కొత్త చాప్టర్ కు తెర తీస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రణీత సుభాష్, యామీ గౌతమ్ వంటి హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోయారు. ఇలా వరసగా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటుండడంతో అంజలి పెళ్లి వ్యవహారం లైమ్ లైట్లోకి వచ్చింది.

తెలుగమ్మాయి అంజలి త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ రూమర్లు గుప్పుమన్నాయి. అయితే అంజలి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అంజలి ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. ప్రస్తుతం తన దృష్టాంతా సినిమాలపైనే ఉంది. పెళ్లి ఊసే లేదు.

- Advertisement -

రీసెంట్ గా అంజలి వకీల్ సాబ్ లో చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం మరిన్ని చిత్రాలను సైన్ చేసే ఉద్దేశంలో ఉంది ఈ రాజోలు భామ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All