Homeన్యూస్యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న బుల్లితెర నటి అంజలి

యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న బుల్లితెర నటి అంజలి

యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న బుల్లితెర నటి అంజలి
యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న బుల్లితెర నటి అంజలి

ప్రస్తుతం తారలంతా కూడా తమ తమ అభిమానులతో నేరుగా టచ్‌లో ఉంటున్నారు. వారి వారి అభిమానుల కోరికలు, ఇష్టాలను తెలుసుకుని వాటికి తగ్గట్టుగా సెలెబ్రిటీలు రకరకాల కంటెంట్‌ల వస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బుల్లితెర తారల హవానే ఎక్కువగా ఉంటోంది. ఇందులో భాగంగా బుల్లితెర తారలు సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ వీడియోలతో హంగామా చేస్తుంటారు. ఒకప్పుడు మొగలి రేకులు వంటి సీరియల్‌తో నటి అంజలి అందరినీ మెప్పించింది.

నటి అంజలి తన సహ నటుడు పవన్‌తో ప్రేమలో పడ్డారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అంజలి, పవన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ధన్విక అంటూ తన పాప పేరుతో ఓ ఇన్ స్టాగ్రాం ఖాతాను కూడా ఓపెన్ చేశారు. అసలే అంజలి ఇన్ స్టాగ్రాం ఖాతాకు 15 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఇక అంజలి కూతురు ధన్వికకు దగ్గరదగ్గరగా లక్ష మంది ఫాలోవర్లున్నారు. తల్లీకూతుళ్లిద్దరూ కూడా సోషల్ మీడియాలో ఆడియెన్స్‌ను అలరిస్తుంటారు.

- Advertisement -

ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అంజలి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల ద్వారానే కాకుండా యూట్యూబ్ చానెల్ పెట్టి తన అభిమానులను అలరిస్తున్నారు. యూట్యూబ్ వీడియోల్లోనూ తమ పర్సనల్ అండ్ కెరీర్ విషయాలను చెబుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

అంజలి ఈ మధ్య వెండితెరపై ఎక్కువగా కనిపించకపోయినా కూడా.. సోషల్ మీడియా ద్వారా అందరితోనూ టచ్‌లో ఉంటోంది. ఇట్లు మీ అంజలి పవన్ అనే యూట్యూబ్ చానెల్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. రెండు లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లతో అంజలి నెట్టింట్లో దూసుకుపోతోంది. ఇక తన తోటీ నటీనటులతో కలిసి అంజలి చేసే అల్లరి మామూలుగా ఉండదు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రాంలో అంజలి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All