Homeటాప్ స్టోరీస్ఆ క్లబ్ లో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్

ఆ క్లబ్ లో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్

ఆ క్లబ్ లో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్
ఆ క్లబ్ లో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్

ఈ మధ్యన టీవీలో ఒక యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది అది ఏంటంటే,… ఒక పిల్లాడు క్లాస్ రూమ్ లోకి వస్తుంటే, మిగిలిన పిల్లలు రా…రా… రా.. రా పక్కన కూర్చో అని అరుస్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్ కంపెనీ ఉద్దేశం ఏదీ అయినా, తర్వాతి రోజుల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎదుటి వ్యక్తిని ట్రోల్ చెయ్యడానికి దీన్ని వాడుతున్నారు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ సినిమా మ్యూజిక్ చూసి, సోషల్ మీడియా ఫ్యాన్స్ అనిరుధ్ కూడా కాపీ కొట్టి మ్యూజిక్ ఇచ్చే క్లబ్ లో చేరిపోయాడు అంటున్నారు.

ఒకసారి గమనిస్తే, ప్రస్తుతం సెన్సేషనల్ అవుతున్న రజనీకాంత్ సినిమా దర్బార్ సినిమా టైటిల్ సాంగ్ ని అనిరుధ్ రెండు పాటల నుండి కాపీ కొట్టాడని, పాట రజనీ మార్క్ మ్యాజిక్ తో బాగున్నా కానీ, అనిరుధ్ అలా కాపీ కొట్టకుండా ఉండాల్సింది అని కొంతమంది పాజిటివ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సినిమాలకు సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా, దాన్ని పట్టుకుని పోస్ట్ మార్టమ్ చేసే బ్యాచ్ మాత్రం, దర్బార్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో మొదట వచ్చే మ్యూజిక్ ని అనిరుధ్; రజనీకాంత్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ భాషా సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ నుండి మిగిలిన పాటను చియాన్ విక్రం అట్టర్ ఫ్లాప్ సినిమా అయిన “మజా” లో ఉన్న “అయ్యా రేటు” సాంగ్ నుండి కాపీ కొట్టాడని ప్రూఫ్ లు చూపిస్తూ తెగ తిడుతున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుతానికి అనిరుధ్ కూడా, కాపీ క్లబ్ లో కూడా చేరిపోయాడని meme పేజ్ లు maintain చేసే అడ్మిన్ లు ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All