Homeటాప్ స్టోరీస్అయ‌న ఓకే అంటే ఎగిరి గంతేస్తా!

అయ‌న ఓకే అంటే ఎగిరి గంతేస్తా!

 

Anil Ravipudi Planig a Film with Megastar?
Anil Ravipudi Planig a Film with Megastar?

అనిల్ రావిపూడి.. తీసింది నాలుగు సినిమాలే. ప‌టాస్‌, సుప్రీమ్‌, ఎఫ్‌2 తాజాగా `స‌రిలేరు నీకెవ్వ‌రు`. నాలుగ‌వ సినిమా రిలీజ్ కాకుండానే అనిల్  రావిపూడి స్టార్ డైరెక్ట‌ర్‌ల లీగ్‌లోకి చేరిపోయారు. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిస్తే అనిల్ ద‌శ మారిపోతుంది. స్టార్ డైరెక్ట‌ర్ కాస్త బిగ్ డైరెక్ట‌ర్‌ల జాబితాలోకి చేరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో ఈ యంగ్ డైరెక్ట‌ర్‌తో సినిమాలు చేయాల‌ని ఇప్ప‌టికే చాలా మంది హీరోలు క‌ర్చీఫ్ ప‌రిచేస్తున్నార‌ట‌.

- Advertisement -

`ఎఫ్‌2` బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో ఆ సినిమాకి సీక్వెల్‌ని చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో వున్నాడు అనిల్. ఇందు కోసం స్క్రిప్ట్‌ని కూడా సిద్ధం చేశాడ‌ట‌. `ఎఫ్ 3` పేరుతో దీన్ని తెర‌పైకి తీసుకురానున్నాడ‌ట‌. ఇదిలా వుంటే అనిల్‌ని `ఎఫ్‌2` బాలీవుడ్ రీమేక్ కోసం నిర్మాత దిల్ రాజు ఫోర్స్ చేస్తున్నార‌ని, ఆయ‌తే ఆ విష‌యంలో త‌న‌కు ఇంకా క్లారిటీ లేద‌ని అనిల్ రావిపూడి బుధ‌వారం స్ప‌ష్టం చేశారు.

`స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ వేడుక‌లో చిరుని అనిల్ ఇంప్రెస్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో సినిమా అవ‌వ‌కాశం వ‌స్తే చేస్తారా? అని అడిగితే అవ‌కాశం వ‌స్తే ఎగిరి గంతెయ్య‌ను అంటున్నారు అనిల్‌. మెగాస్టార్ చిరంజీవి టైమ్ ఇవ్వాలే కానీ కేవ‌లం మూడే మూడు నెల‌ల్లో బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్లి ఆయ‌న ముందు పెట్టేస్తా అని చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి జోష్ చూస్తుంటే అన్నంత ప‌ని చేసేలా వున్నాడ‌ని, త్వ‌ర‌లో చిరు నుంచి అనిల్‌కు పిలుపు వ‌చ్చినా ఆశ్య‌ర్యం లేది ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All