
దర్శకుడు అనిల్ రావిపూడి గురి తొలిసారి తప్పిన చిత్రం గాలి సంపత్. ఐతే ఈ చిత్రానికి ఆయన దర్శకుడు కాదు. కాకపోతే స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు. షైన్ స్క్రీన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. గాలి సంపత్ దారుణమైన ప్లాప్ గా మిగిలింది. షైన్ స్క్రీన్ కు భారీ నష్టాలే వచ్చాయి.
మరి ఆ నష్టాలను సెటిల్ చేయడానికో లేదా ముందే డీల్ కుదిరిందో కానీ అనిల్ రావిపూడి ఈ బ్యానర్ కు ఒక సినిమా చేస్తున్నాడు. అది కూడా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ఒక సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తైపోయాయి.
బాలయ్య కూడా ఈ ప్రాజెక్టును చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడు. అనిల్ రావిపూడి ఎఫ్3 పూర్తైన తర్వాత బాలయ్య స్క్రిప్ట్ పై మరోసారి కూర్చుని ఫైనల్ చేస్తాడు. అప్పుడు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తారు. మరింత సమాచారం త్వరలోనే వచ్చే అవకాశముంది.