Homeటాప్ స్టోరీస్మరో మ్యానరిజంతో మన ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి

మరో మ్యానరిజంతో మన ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి

Anil Ravipudi mannerisms to be highlight in Sarileru Neekevvaru
Anil Ravipudi mannerisms to be highlight in Sarileru Neekevvaru

ప్రతి దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. ఆ శైలిని తన ప్రతి సినిమాలో రిపీట్ చేయాలని చూస్తుంటాడు. దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఒక శైలి ఉంది. తన ప్రతి సినిమాలో ఏదొక మ్యానరిజం పెట్టడం ఈ దర్శకుడికి అలవాటు. ఆ మ్యానరిజం ను సినిమాలో చాలా చోట్ల సందర్భానికి తగినట్లుగా పెట్టిస్తూ ఉంటాడు. పటాస్ సినిమాలో పార్ధాయ, సుప్రీమ్ అమేజింగ్ జింగ్ జింగ్ అనడం కానీ, రాజా ది గ్రేట్ లో ముఖచిత్రం, ఎఫ్ 2 లో అంతేగా అంతేగా వంటి మ్యానరిజమ్స్ జనాలకు భలేగా కనెక్ట్ అయ్యాయి. సినిమా విజయాలలో అవి కీలక పాత్రలు పోషించాయి కూడా. క్రిటిక్స్ అనిల్ రావిపూడి చిత్రాలకు యావరేజ్ రేటింగులే ఇచ్చారు. అయితే చేసిన సినిమాలు నాలుగు కూడా సూపర్ డూపర్ హిట్టయ్యాయ్.

క్రిటిక్స్ ను దృష్టిలో ఉంచుకోకుండా ప్రేక్షకులకు ఏదైతే నచ్చుతుందో అది అందివ్వడం అనిల్ రావిపూడికి ఉన్న ప్రత్యేకత. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా అనిల్ రావిపూడి ఇలాంటి మ్యానరిజం ఫాలో అయ్యాడు. ట్రైలర్ లో దీనికి సంబంధించిన బిట్స్ కూడా పెట్టాడు. చూస్తుంటే ఈసారి కూడా అనిల్ టార్గెట్ మిస్ అయినట్లు కనిపించట్లేదు. ట్రైలర్ లో చూపించిన అర్ధమవుతోందా, అబ్బబ్బబ్బబ్బా… నెవర్‌ బిఫోరు ఎవర్‌ ఆఫ్టరు మ్యానరిజమ్స్ ఫన్ జెనరేట్ చేసేలానే ఉన్నాయి. ఒక సందర్భంలో మహేష్ కూడా దీన్ని పలికాడు.

- Advertisement -

మాస్ ను, యూత్ ను దృష్టిలో ఉంచుకుని అనిల్ రావిపూడి వీటిని సృష్టిస్తున్నాడు. అవి ప్రేక్షకులకు నచ్చుతున్నాయి కూడా. ఈసారి గత సినిమాల రేంజ్ లో ఇవి వర్కౌట్ అయితే ఇక ఈ సినిమాకు తిరుగుండకపోవచ్చు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All