
పటాస్ డైరెక్టర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం యాంకర్ గా మారాడు. బాహుబలి మూవీ తో తెలుగు సినిమా సాటి ఏంటో వరల్డ్ వైడ్ గా తెలిసేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి..ఇప్పుడు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించారు. ఈ మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ గోండు బెబ్బులి కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. మార్చి 25 న పలు భాషల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ ను స్పీడ్ చేసారు.
ఇప్పటికే పలు భాషల్లో వరుస ఇంటర్వూస్ ఇస్తూ సినిమా తాలూకా విశేషాలను పంచుకున్న చిత్ర యూనిట్..తాజాగా అనిల్ రావిపూడి తో చిట్ చాట్ చేసి సినిమాలోని హైలైట్స్ ను పంచుకున్నారు. దీనికి సంబదించిన వీడియో ను మేకర్స్ రిలీజ్ చేసారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి..ఆర్ఆర్ఆర్ కోసం యాంకర్ గా మరిఅభిమానులను ఆకట్టుకున్నారు. మార్చి 19న సాయంత్రం 6 గంటలకు కర్ణాటకలోని చిక్కబల్లాపురలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.