Homeటాప్ స్టోరీస్విజయశాంతి అనిల్ రావిపూడికి చుక్కలు చూపించిందిట

విజయశాంతి అనిల్ రావిపూడికి చుక్కలు చూపించిందిట

Anil Ravipudi explains how Vijayshanti agreed to act in Sarileru Neekevvaru
Anil Ravipudi explains how Vijayshanti agreed to act in Sarileru Neekevvaru

దర్శకుడిగా అనిల్ రావిపూడిది విజయవంతమైన ప్రస్థానం. ఇప్పటికి నాలుగు సినిమాలు చేసిన అనిల్ రావిపూడి నాలుగు సినెమాలతోనూ విజయాలు అందుకున్నాడు. అందులోనూ ఒకదాన్ని మించి ఒక సినిమా హిట్ అవ్వడమే కాకుండా దర్శకుడిగా తన రేంజ్ ను కూడా పెంచుకుంటూ వస్తున్నాడు. తన మొదటి చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన అనిల్ రావిపూడి, తర్వాత వరసగా సాయి ధరమ్ తేజ్, రవితేజ, వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పనిచేసాడు. సక్సెస్ పరంగా కూడా నాలుగు సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2… ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం చేస్తోన్న ఐదవ సినిమాతో తన రేంజ్ ను మరింత పెంచుకుంటున్నాడు అనిల్ రావిపూడి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో సినిమా చిత్రీకరణ పూర్తైపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసి జనవరి 11న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. మరో రెండు, మూడు రోజుల్లో ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో జరగబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సూపర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దాదాపు 124 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయిందంటే ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 25 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఈ టీజర్, 5 లక్షల లైకులను కూడా సాధించింది.

ఇక ఈ చిత్రంలో విజయశాంతి ముఖ్యపాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆమె ముఖానికి రంగు వేసుకున్నారు. అయితే అదంత ఈజీగా ఏం జరగలేదని అంటున్నాడు అనిల్ రావిపూడి. ఆమెను ఒప్పించేటప్పటికి చుక్కలు కనిపించాయని అంటున్నాడు. అసలు విజయశాంతిని రాజా ది గ్రేట్ లోనే నటింపజేయాలని అనుకున్నాడట అనిల్. మొదట ఈ సినిమాలో హీరోగా రామ్ ను అనుకున్నప్పుడు విజయశాంతి ఆమె తల్లి పాత్రలో కనిపిస్తే బాగుంటుందని ఆశించాడు. అయితే విజయశాంతి ఒప్పుకోకపోవడంతో రాధికను తీసుకుని తల్లి పాత్రను కొంత మేర కుదించాడట. హీరోగా రామ్ ఎస్ చెప్పకపోవడంతో ఆ కథ రవితేజ వద్దకు వెళ్ళింది. అలా రాజా ది గ్రేట్ జరిగింది.

- Advertisement -

అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా అనుకున్నప్పుడు మాత్రం విజయశాంతిని ఎలాగైనా నటింపజేయాలని ఆశ పడ్డాడట. అయితే విజయశాంతి కనీసం కథ వినడానికి కూడా ఇష్టపడలేదని, కథ వింటే ఎక్కడ చేయాల్సొస్తుందేమోనని అసలు కథ కూడా చెప్పొద్దూ అంటూ ఉండేదని తెలిపాడు. అయితే ఊరికే ఆమె ఇంటికి రెండు, మూడు రోజులు వెళ్లి కలిసి వచ్చేసేవాడట. ఆ తర్వాత ఒకరోజు రెండున్నర గంటలపాటు కథ చెబితే ఆమె పొట్టపగిలేలా నవ్వి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. మొత్తానికి విజయశాంతి వంటి నటి రీ-ఎంట్రీ తన దర్శకత్వంలో జరుగుతుండడం తనకు చాలా హ్యాపీగా ఉందని సెలవిచ్చాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All