Homeటాప్ స్టోరీస్తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ పట్టేసిన అజిత్ కూతురు

తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ పట్టేసిన అజిత్ కూతురు

తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ పట్టేసిన అజిత్ కూతురు
తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ పట్టేసిన అజిత్ కూతురు

అజిత్ కూతురిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా విశ్వాసంలో నటించిన అనికా సురేంద్రన్. ఇప్పుడు ఈ భామ పెరిగి పెద్దదైంది. తద్వారా హీరోయిన్ అవకాశాలను అందుకుంటోంది. ముందుగా తెలుగు ఇండస్ట్రీ ఆమెను స్వాగతిస్తోంది. అనికా ఇప్పటికే రెండు పేరున్న టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకుంది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటిస్తోన్న చిత్రంలో అనికా కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన కప్పుల చిత్రం తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ అవుతోంది. హీరోయిన్ ప్రధానంగా నడిచే ఈ చిత్రంలో అనికా మెయిన్ లీడ్ గా చేయనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

- Advertisement -

ఇక ఈ రెండు సినిమాలు కనుక అనికాకు మంచి పేరు తీసుకొస్తే ఇక ఆమె కెరీర్ తారాస్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం అనికా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ ను పోస్ట్ చేస్తుంది అనికా. ప్రస్తుతం ఆమెకు 1.4 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All