Homeటాప్ స్టోరీస్తెలుగుజాతి పౌరుషం చచ్చిపోయిందా ? తాకట్టు పెట్టారా ?

తెలుగుజాతి పౌరుషం చచ్చిపోయిందా ? తాకట్టు పెట్టారా ?

Andhra Pradesh Special Statusమదరాసీలు గా పిలవబడే తెలుగువాళ్ళని మాకంటూ ఆత్మగౌరవం ఉందని యావత్ ప్రపంచానికి చాటి చెప్పి తెలుగు ఖ్యాతిని నలుదిశలా వ్యాపింప జేసి , తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం తో తెలుగుదేశం పార్టీ ని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికార పీఠాన్ని అధిరోహించిన మహానాయకుడు నందమూరి తారకరామారావు . దశాబ్దాల పాటు వేళ్లూనుకున్న కాంగ్రెస్ పార్టీ ని కూకటివేళ్లతో పెకిలించిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్ , ఒక్క తెలుగునాట మాత్రమే రాజసాన్ని ప్రదర్శించడమే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కూటమి ని ఏర్పాటు చేసి లోక్ సభలో ప్రతిపక్ష హోదా ని ఒక ప్రాంతీయ పార్టీ కి తెచ్చిపెట్టి తెలుగువాడి సత్తా, తెలుగువాడి పౌరుషం ఏంటో చాటిన అసలు సిసలైన నాయకుడు ఎన్టీఆర్ .

ఎన్టీఆర్ తర్వాత జాతీయ స్థాయిలో కూటమి ని ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే , ఎన్ డి ఏ ఏర్పాటులో కీలక పాత్ర వహించడమే కాకుండా జాతీయ స్థాయిలో కన్వీనర్ గా ఉండి కింగ్ మేకర్ పాత్రలో రాణించాడు కూడా కానీ ……… అదంతా గతం మరి ఇప్పుడో ………

- Advertisement -

ఒకప్పుడు జాతీయ స్థాయిలో అత్యంత పలుకుబడి ఉన్న నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు . పేరుకి బిజెపి ప్రభుత్వం లోని ఎన్ డి ఏ లో భాగస్వామి కానీ ఆంధ్రప్రదేశ్ కు విభజన సమయంలో ఇచ్చిన హామీలను సాధించడంలో పూర్తిగా విఫలం అవుతున్నాడు . ప్రత్యేక హోదా నుండి ప్రత్యేక ప్యాకేజి కి ఒప్పుకున్నాడు కానీ దానికి కూడా దిక్కు లేకుండా పోవడంతో అటు కేంద్ర ప్రభుత్వం తో యుద్ధం చేయలేక , ఇటు అస్త్ర సన్యాసం చేయలేక సతమతం అవుతున్నాడు . రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదు అంటూనే కేంద్రాన్ని నిలదీయడంతో మాత్రం ” తెలుగువాడి పౌరుషాన్ని ” చూపించలేక పోతున్నాడు .

ఇక ప్రశ్నిస్తానంటూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం ఆరంభ శూరత్వమే తప్ప సరైన దిశలో సాగడమే లేదు . రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన జగన్ స్వప్రయోజనం కోసం రాజీ డ్రామాలు మొదలు పెట్టారు . అయితే కేంద్రం పై ఎవరు కూడా నేరుగా పోరాడే సాహసం చేయలేక పోతున్నారు . నేరుగా మోడీ ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారంటే వీళ్ళలో తెలుగుజాతి పౌరుషం చచ్చిపోయిందా ? లేక తెలుగుజాతి పౌరుషాన్ని తాకట్టు పెట్టారా ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All