Homeటాప్ స్టోరీస్యాంకర్ సుమ కుటుంబంలో విషాదం

యాంకర్ సుమ కుటుంబంలో విషాదం

బుల్లితెరపై యాంకర్ గా పాపులర్ అయిన సుమ ఇంట తీవ్ర విషాదం నెలకొంది . సుమ అత్తగారైన లక్ష్మీదేవి కనకాల  (78) ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో కన్నుమూశారు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి నటనలో పలువురు ప్రముఖులకు శిక్షణ ఇచ్చింది . ఇప్పుడు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ లుగా వెలుగొందుతున్న రజనీకాంత్ , చిరంజీవి లతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి మహామహులు లక్ష్మీదేవి దగ్గర నటనలో శిక్షణ పొందారు .

లక్ష్మీ దేవి – దేవదాస్ కనకాల లకు ఇద్దరు సంతానం కాగా ఒకరు రాజీవ్ కనకాల , కుమార్తె శ్రీలక్ష్మి లు . ఇక సుమ లక్ష్మీదేవి కి  కోడలు అన్న విషయం అందరికీ తెలిసిందే . లక్ష్మీదేవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు . తెలుగులో పలు చిత్రాల్లో కూడా నటించింది లక్ష్మీదేవి . అత్తగారు చనిపోవడంతో యాంకర్ సుమ ఇంట్లో విషాదం నెలకొంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All