Homeటాప్ స్టోరీస్మహిళా దినోత్సవం ను ఫూల్స్ డే గా అభివర్ణించిన అనసూయ..ఎందుకంటే

మహిళా దినోత్సవం ను ఫూల్స్ డే గా అభివర్ణించిన అనసూయ..ఎందుకంటే

anasuya women's day post viral
anasuya women’s day post viral

ఈరోజు (మార్చి8) మహిళా దినోత్సవం సందర్భాంగా ప్రతి ఒక్కరు ఆడవారి గురించి గొప్పగా చెప్పుకుంటూ , సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. అయితే నటి అనసూయ మాత్రం మహిళా దినోత్సవం రోజును ఫూల్స్ డే గా తెలిపింది..దీనికి కారణం కూడా తెలిపి వార్తల్లో నిలిచింది. ఈరోజు మాత్ర‌మే చాలామంది మ‌హిళ‌ల‌ను గౌర‌విస్తారని..రేపటి నుండి మాములే అని ఆమె పేర్కొంది. ట్రోల‌ర్లు, మీమ్స్ చేసేవారు అక‌స్మాత్తుగా మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం ప్రారంభించారని, మ‌హిళ‌లంటే ఏంటో వారు ఒక్క‌సారిగా గ్ర‌హించే రోజు ఇదని అనసూయ చెప్పింది.

“అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ప్రతి ట్రోలర్, మీమర్ సడెన్‌గా మహిళలకు గౌరవమిస్తూ సందేశాలు పెట్టడం షురూ చేస్తారు. కాకపోతే అది 24 గంటల్లోనే ముగుస్తుంది. కాబట్టి అలాంటివి నమ్మకండి. హ్యాపీ ఫూల్స్ డే” అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పెట్టగానే అందరు తెగ షేర్ చేయడం స్టార్ట్ చేసారు. కొంతమంది ఈమె పోస్ట్ ఫై విమర్శలు చేస్తున్నారు. ఈ సమాజంలో మహిళలకు గౌరవమిచ్చే వాళ్ళు లేరనే ఉద్దేశంతోనే అనసూయ ఇలా పెట్టిందని కొంతమంది అంటే.. అందరు మగ్గాళ్లు ఒకేలా ఉండరని, గుడ్డిగా అలా అనుకోవడం నీ తప్పు అంటూ మరికొందరు ఆమెపై అటాక్ చేస్తున్నారు. మొదటి నుండి కూడా అనసూయ సోషల్ మీడియా లో ఏ పోస్ట్ పెట్టిన దానిని వ్యతిరేకించడం కామన్..అందుకే అనసూయ అలాంటివి ఏమిపట్టించుకోకుండా ఆమె చెప్పాలనుకున్నది చెప్పేయడం..చూపించాల్సింది చూపించడం చేస్తుంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All