
అనసూయ ..ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా యావత్ ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకున్న ఈమె..ఆ తర్వాత వెండితెరకు ఎంట్రీ ఇస్తూ..విభిన్న పాత్రల్లో ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటూ వస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా , పుష్ప లో ద్రాక్షాయని గా గుర్తిండే పాత్రలు చేసింది. ఇక ఓ పక్క బుల్లితెర , వెండితెర ఫై బిజీ గా ఉంటూనే సోషల్ మీడియా లో అత్యధిక ఫాలోయర్స్ తో రాణిస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాల ప్రదర్శన చేస్తూ ఉండడం తో అమ్మడిఫై నిత్యం వివాదస్పద కామెంట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్ లను టార్గెట్ చేసి కొంతమంది విమర్శిస్తుంటారు. ఇద్దరి పిల్లలకు తల్లయినప్పటికీ ఆ డ్రెస్ లు ఏంటి అని కామెంట్స్ పెడుతుంటారు.
తాజాగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా కనిపించి ఆకట్టుకుంది. వీలైనంతగా మోడ్రన్ లుక్స్‌తో ఆకట్టుకోవడం, అప్పుడప్పుడూ చీరకట్టి అందాల విందివ్వడం అనసూయ నైజం. ఆమె పోస్ట్ చేసే రెగ్యులర్ ఫొటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. వీటిపై వచ్చే కామెంట్ల సంగతి అటుంచితే అనసూయ ఫొటో షూట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారు చాలామందే ఉన్నారు. శ్రీ రామ నవమి సందర్భంగా పద్ధతైన దుస్తుల్లో నమస్కారం చేస్తూ ఎంతో సంప్రదాయబద్ధంగా దిగిన ఓ పిక్ షేర్ చేసింది అనసూయ. ఈ మేరకు ‘అందరికీ శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు’ అంటూ విష్ చేసింది. అయితే అనసూయను ఇలా చూసిన నెటిజన్లు.. వావ్! సూపర్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.