
బుల్లితెర ఫై ఎంతో పాపులర్ తెచ్చుకున్న అనసూయ..వెండితెర ఫై కూడా అంతే పాపులర్ అవుతుంది. వరుస అవకాశాలతో రాణిస్తున్న ఈ బ్యూటీ..చిరంజీవి సరసన ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తుంది. గాడ్ ఫాదర్ చిత్రం తో పాటు ఆచార్య మూవీస్ లలో నటిస్తుంది. అయితే ఆచార్య చిత్రానికి గాను అనసూయ రూ. 25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ‘ఆచార్య’ సినిమాలో కథను మలుపుతిప్పే క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనున్నట్లు సినీ వర్గాల టాక్.
కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ తెరకెక్కుతుండగా..చిరంజీవి సరసన కాజల్ నటించగా , రామ్ చరణ్ కు జోడిగా పూజా హగ్దే నటిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అనసూయ విషయానికి వస్తే..గతేడాది ‘పుష్ప: ది రైజ్’లో దాక్షాయణిగా మంచి నెగెటివ్ పాత్రలో అలరించింది. పుష్ప సెకండ్ పార్ట్‌లో కూడా తన క్యారెక్టర్ కొనసాగుతుందని, అది కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. తాజాగా ‘దర్జా’ మూవీతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది ఈ హాట్ బ్యూటీ.