
మాస్ హహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. శృతిహాసన్ రీఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ తరువాత రవితేజ మరో మాస్ మసాలా ఎంటర్‌టైనర్ ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `ఖిలాడీ` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. రవితేజ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని ఇటవలే మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రవితేజకు జోడీగా డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు ఈ మూవీకి మరింత గ్లామర్‌ని దర్శకుడు రమేష్‌వర్మ జోడిస్తున్నాడట.
ఇందు కోసం జబర్దస్త్ ఫేమ్ రంగమ్మత్త అనసూయని రంగంలోకి దింపేస్తున్నట్టు తెలుస్తోంది. చలాకీ లేడీగా బుల్లి తెరపై మంచి పేరున్న అనసూయ గత కొంత కాలంగా సోషల్ మీడియాని వరుస ఫొటో షూట్లతో హీటెక్కిస్తోంది. ప్రస్తుతం రంగమార్తాండ, ఆచార్య చిత్రాల్లో నటిస్తున్న అనసూయ తాజాగా `కిలాడీ` హీరో మాస్ మహారాజాతో కలిసి నటించే ఛాన్స్‌ని కొట్టేసిందని తాజాగా వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం వుందని తెలిసింది.