Homeటాప్ స్టోరీస్లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోన్న అనసూయ

లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోన్న అనసూయ

anasuya doing a lady oriented movie 
anasuya doing a lady oriented movie

అటు టివి రంగాన్ని, ఇటు సినిమాలను మ్యానేజ్ చేస్తోంది అనసూయ. బుల్లితెరపై ఎక్కువగా గ్లామరస్ గా కనిపించే అనసూయ, సినిమాలు మాత్రం ఛాలెంజింగ్ వి ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అనసూయ చాలానే సినిమాలను చేస్తోంది. పుష్ప ది రైజ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడీ చిత్రంలో టివి ఛానల్ హెడ్ పాత్రలో కనిపించనుంది.

ఇవి కాకుండా చిరంజీవి గాడ్ ఫాదర్, కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. తాజా సమాచారం ప్రకారం అనసూయ ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం కూడా చేస్తోంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

అనసూయ లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అటు టివి కెరీర్ కు బ్రేక్ ఇవ్వకుండా సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది అనసూయ. చూడాలి మరి ఈ రెండు పడవల ప్రయాణంలో ఆమె ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All