Homeటాప్ స్టోరీస్రౌడీ సెట్లో బాలీవుడ్ బ్యూటీ హ‌ల్‌చ‌ల్‌!

రౌడీ సెట్లో బాలీవుడ్ బ్యూటీ హ‌ల్‌చ‌ల్‌!

రౌడీ సెట్లో బాలీవుడ్ బ్యూటీ హ‌ల్‌చ‌ల్‌!
రౌడీ సెట్లో బాలీవుడ్ బ్యూటీ హ‌ల్‌చ‌ల్‌!

`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ్‌` ఫ‌లితం నిరాశ‌ప‌ర‌చ‌డంతో పూర్తిగా త‌న దృష్టినంతా త‌దుప‌రి చిత్రంపైపెట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంతో విజ‌య్ బాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు. బాలీవుడ్ నిర్మాత‌, దర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్, అపూర్వ మెహ‌తా భాగ‌స్వాములుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రాన్ని పూరిజ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై చార్మి, పూరి క‌లిసి నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి `ఫైట‌ర్‌` అనే టైటిల్ వినిపిస్తోంది. `లైగ‌ర్‌` ఈనేది కూడా ప్ర‌చారంలో వుంది. ఇటీవ‌ల ఈ చిత్రాన్ని ముంబైలో ప్రారంభించారు. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ అక్క‌డే జ‌రుగులోంది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ప‌లువురు బాలీవుడ్ భామ‌ల్ని ప‌రిశీలించిన పూరి జ‌గ‌న్నాథ్ ఫైన‌ల్‌గా బాలీవుడ్ క్రేజీ గాళ్ అన‌న్యాపాండేని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. గురువారం ఆమె ఈ మూవీ సెట్‌లోకి ఎంట‌రైంది.

- Advertisement -

ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు పూరి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. సెట్‌లో అన‌న‌య్య‌తో వున్న కొన్ని ఫొటోల‌ని కూడా షేన్ చేశారు. `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రంలో హీరో రామ్‌ని కొత్త పంథాలో ఆవిష్క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్న పూరి ఈ చిత్రంలోనే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని స‌రి కొత్త గెట‌ప్‌లో ప్ర‌జెంట్ చేయ‌బోతున్నాడు. పూరి తొలి పాన్ ఇండియా స్థాయి సినిమా కావ‌డంతో ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All