
లైగర్ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. విజయదేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. తాజాగా అనన్య ఈ సినిమాకి డబ్బింగ్‌ను మొదలుపెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా చిత్రబృందం అప్‌డేట్ ఇచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్ – పూరి కనెక్ట్స్ పతాకాలపై కలిసి దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇక ఈ మూవీ లో ప్రముఖ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ నెక్స్ట్ మూవీ కూడా పూరి డైరెక్షన్లోనే చేయబోతున్నాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చిత్రాన్ని విజయ్ తో చేస్తున్నాడు.
The Fascinating Diva ?@ananyapandayy begins dubbing?for #LIGER ??? #VaatLagaDenge ??@TheDeverakonda @MikeTyson #PuriJagannadh @karanjohar @Charmmeofficial @DharmaMovies @PuriConnects @apoorvamehta18 @IamVishuReddy pic.twitter.com/QOzSrS4ZuR
— Puri Connects (@PuriConnects) April 11, 2022