
ప్రముఖ కాస్మో కవర్ పేజీ ఫై అందమైన భామలు అందాల ఆరబోతతో వేడి పుట్టిస్తున్నారు. మొన్న సమంత ఘాటైన హాట్ పోజ్..ఇవ్వగా..తాజాగా లైగర్ బ్యూటీ అనన్య పాండే అందాల ఆరబోత చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవలే అనన్య పాండే ‘గెహరియాన్’ అనే సినిమాలో నటించింది. ఇందులో ఈ అమ్మడు బోల్డుగా కనిపించి అందరికీ షాకిచ్చింది. దీపికా పదుకొనేతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ హాట్ టాపిక్ అయిపోయింది. ఇక ఇప్పుడు కాస్మో ఇండియా కోసం కవర్ ఫొటో దిగింది. దీన్ని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ మొత్తం విప్పేసి కనిపించింది. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఇదే కవర్ పేజీ ఫై సామ్..హాట్ పోజ్ ఇచ్చి హల్చల్ చేయగా..ఇప్పుడు అనన్య పాండే వంతు అయ్యింది.
ఇక అనన్య సినిమాల విషయానికి వస్తే ..విజయ్ దేవరకొండ – డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘లైగర్’. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.