Homeటాప్ స్టోరీస్రౌడీ హీరోపై మ‌న‌సుప‌డింద‌ట‌!

రౌడీ హీరోపై మ‌న‌సుప‌డింద‌ట‌!

రౌడీ హీరోపై మ‌న‌సుప‌డింద‌ట‌!
రౌడీ హీరోపై మ‌న‌సుప‌డింద‌ట‌!

తెలుగు తెర‌పైనే కాకుండా  సా‌మాజిక కార్య‌క్ర‌మాల‌తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు నేనున్నానంటూ ముందుకొచ్చి త‌న స‌హృద‌య‌త‌ను చాటుకుంటూ ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇదే యాటిట్యూడ్‌కి ద‌క్షిణాది తార‌ల‌తో పాటు ఉత్త‌రాది వారు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఫిదా అయిపోతున్నారు.

త‌న సినిమాల‌తో ఆక‌ట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ప్ర‌తీ ఒక్క‌రూ ఇష్ట‌ప‌డ‌టం మొద‌లైంది. ఆ మ‌ధ్య క‌ర‌ణ్‌జోహార్ నిర్వ‌హించిన `కాఫీ విత్ క‌ర‌ణ్‌` షోలో అతిలోకసుంద‌రి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ త‌న‌కు విజ‌య్ దేవ‌ర కొండ‌తో న‌టించాల‌ని వుంద‌ని వెల్ల‌డించింది. జాన్వీతో పాటు ప‌లువురు బాలీవుడ్ తార‌లు త‌మ‌కూ అలాంటి కోరికే వుంద‌ని బాహాటంగానే వెల్ల‌డించారు.

- Advertisement -

తాజాగా ఈ జాబితాలో త‌మిళ హీరోయిన్ అమైరా ద‌స్తూర్ చేరింది. ప్ర‌స్తుతం హోమ్ క్వారెంటైన్‌వున్న వున్న అమైరా త‌న‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఇష్ట‌మ‌ని ఓ టీవీ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో స్ప‌‌ష్టం చేసింది. తెలుగు హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై త‌న‌కు క్ర‌ష్ వుంద‌ని, `అర్జున్‌రెడ్డి` చిత్రంలో ఆయ‌న న‌ట‌న చూసి మైమ‌ర‌చిపోయాన‌ని, ఆయ‌న‌తో క‌లిసి న‌టించాల‌ని వుంద‌ని, అది కూడా హిందీ సినిమా అయితే బాగుంటుంద‌ని చెప్పింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All