Thursday, December 8, 2022
Homeటాప్ స్టోరీస్వ‌ర్మ‌పై అమృత సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..స్పందించిన వ‌ర్మ‌!

వ‌ర్మ‌పై అమృత సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..స్పందించిన వ‌ర్మ‌!

వ‌ర్మ‌పై అమృత సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..స్పందించిన వ‌ర్మ‌!
వ‌ర్మ‌పై అమృత సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..స్పందించిన వ‌ర్మ‌!

మిర్యాల‌గూడాలో అమృత‌, ప్ర‌‌ణ‌య్ ల ప్రేమ వివాహం, ప్ర‌ణ‌య్ ప‌‌రువు హ‌త్య దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌రువాత అమృత తండ్రి మారుతీరావు బ‌ల‌వన్మరణం కూడా సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతం నేప‌థ్యంలో రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న చిత్రం `మ‌ర్డ‌ర్‌`. `కుటుంబ క‌థాచిత్ర‌మ్‌` అని ఉప‌శీర్ష‌క‌. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని వ‌ర్మ ఫాద‌ర్స్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేశారు.

- Advertisement -

ఇది చూసిన అమృత త‌న‌కు ఆత్మ హ‌త్య చేసుకోవాల‌నిపించింద‌ని, వ‌ర్మ ఇంత నీచానికి దిగ‌జారుతాడ‌ని ఊహించ‌లేద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై వ‌ర్మ తాజాగా స్పందించారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో అమృత రాసిన‌ట్టు చెబుతున్న ఓ నోట్ స‌ర్క్యులేట్ అవుతోంది. దానిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌నుకుంటున్నాను. నేను ఆమె ప్రేమ‌క‌థ‌, ఆమె తండ్రి క‌థ ఆధారంగా సినిమా తీసిన‌ట్టుగా తెలిసి అమృత ఆత్మ హ‌త్య చేసుకోవాల‌ని చూసింద‌ని వార్త ఒక‌టి వైర‌ల్ అవుతోంది. దీనికి స‌మాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం వుంది. దీన్ని అమృతే రాసిందా లేక ప‌‌నిలేక ఎవ‌రైనా రాశారా? అయినా నేను స‌మాధానం చెప్పాల‌నుకుంటున్నాను` అన్నారు వ‌ర్మ‌.

నేను పోస్ట‌ర్‌లోనే క్లియ‌ర్‌గా చెప్పాను ఇది కేవ‌లం నిజ‌జీవిత క‌థ ఆధారంగా చేస్తున్నాన‌ని కానీ నిజ‌జీవిత క‌థ‌నే తెర‌కెక్కిస్తున్నాన‌ని ఎక్క‌డా తాను చెప్ప‌లేద‌ని వ‌ర్మ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక `మ‌ర్డ‌ర్‌` ప‌బ్లిసిటీ పోస్ట‌ర్ కోసం తాను వాడిన ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో విరివిగా దొరికేవే కానీ తాను కావాల‌ని ప్ర‌త్యేకంగా ఎవ‌రి నుంచో తీసుకున్న‌వి కావ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts