
ది లిజెండ్ ఆఫ్ భగత్సింగ్, దీవార్, మస్తీ, మైహూనా, వివాహా వంటి చిత్రాలతో బాలీవుగడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బ్యూటీ అమృతారావు. మహేష్ బాబు నటించిన `అతిధి` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీతో హీరోయిన్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న అమృత తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. తిరిగి బాలీవుడ్ బాటపట్టింది.
2013 వరకు సినిమాల్లో యాక్టీవ్‌గా వున్న అమృతారావు 2016లో ఆర్జే అన్మోల్‌ని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా వుంటూ వస్తోంది. 2019లో ఆమె నటించిన చిత్రం `థాక్రే`. బాల్ థాక్రే జీవిత కథ ఆధారంగా రూపొందిచ ఈ చిత్రంలో సవాజుద్దీన్ సిద్ధిఖీకి వైఫ్‌గా కనిపించింది. ప్రస్తుతం ఫ్యామిలీకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న అమృత ప్రస్తుతం గర్భవతి.
చాలా మంది హీరోయిన్‌లు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ అభిమానులతో పంచుకుంటుంటే అమృత మాత్రం సైలెంట్ గా వుంది. అయితే ఆమె ముంబైలోని ఒక క్లినిక్ బయటి బేబీ బంప్‌తో కనిపించింది ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.