Homeన్యూస్అమావాస్య రివ్యూ

అమావాస్య రివ్యూ

Amavasya movie reviewఅమావాస్య రివ్యూ :
నటీనటులు : సచిన్ జోషి , నర్గీస్ ఫక్రి
సంగీతం : సంజీవ్ – దర్శన్
నిర్మాత : రైనా జోషి
దర్శకత్వం : భూషణ్ పటేల్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 8 ఫిబ్రవరి 2019

 

- Advertisement -

ప్రముఖ వ్యాపారవేత్త సచిన్ జోషి హీరోగా భూషణ్ పటేల్ దర్శకత్వంలో సచిన్ భార్య రైనా జోషి నిర్మించిన చిత్రం అమావాస్య . ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా ?

 

కథ :

 

కరణ్ ( సచిన్ జోషి ) అహానా ( నర్గీస్ ఫక్రి ) అనే జంట వెకేషన్ కోసం కరణ్ పాత బిల్డింగ్ కి చేరుకుంటారు . అయితే ఆ ప్యాలెస్ లోకి వెళ్లిన తర్వాత నుండి వరుసగా అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి . మాయ అనే ఆత్మ ఆ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుంటుంది అహానా . అసలు మాయ ఎవరు ? ఆ ఇంట్లో ఎందుకు ఉంది ? కరణ్ కు మాయ కు సంబంధం ఏంటి ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

 

హైలెట్స్ :

 

నర్గీస్ గ్లామర్

సచిన్ జోషి

 

డ్రా బ్యాక్స్ :

 

ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం

 

నటీనటుల ప్రతిభ :

 

కరణ్ పాత్రలో సచిన్ జోషి రాణించాడు . ముఖ్యంగా క్లైమాక్స్ లో సచిన్ కు మంచి స్కోప్ లభించింది . నర్గీస్ ఫక్రి కి  నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది అలాగే గ్లామర్ తో ఆకట్టుకుంది .  ఇక మిగిలిన పాత్రల్లో మోనా సింగ్ , వివన్ లు రాణించారు .

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాకు అమర్జీత్ సింగ్ అందించిన ఫోటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది , అలాగే పాటలు బాగున్నాయి నేపథ్య సంగీతం కూడా అలరించేలా తోడ్పడింది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు భూషణ్ పటేల్ విషయానికి వస్తే …… హర్రర్ నేపథ్యంలో బాగానే తెరకెక్కించాడు కానీ మరింతగా వర్కౌట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది .

 

ఓవరాల్ గా :

 

హర్రర్ కథాంశ చిత్రాలు కోరుకునే వాళ్లకు మంచి ఛాయిస్ అమావాస్య

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All