
అమలా పాల్ నటించిన ఆడై చిత్రం ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్ వల్ల ఈరోజు విడుదల ఆగిపోయింది . తమిళంలో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆడై , ఫస్ట్ లుక్ , టీజర్ లతో సంచలనం సృష్టించడంతో తెలుగులో ఆమె గా విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు . ఇక తెలుగులో ఈ చిత్ర హక్కులను తమ్మారెడ్డి భరద్వాజ్ పొందారు .
ఈరోజు తెలుగు , తమిళ భాషల్లో ఆమె , ఆడై చిత్రాలు విడుదల కావాల్సి ఉండే , అయితే ఆర్థిక సమస్యల వల్ల సినిమా విడుదల నిలిచిపోయింది . దాంతో హుటాహుటిన రంగంలోకి దిగిన ప్రముఖులు ఆర్థిక సమస్యలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు . ఒకవేళ ఆ సమస్యలు కొలిక్కి వస్తే ఈ సాయంత్రానికి విడుదల అవుతుంది లేదంటే అంతే సంగతులు .
- Advertisement -