Homeటాప్ స్టోరీస్నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేసిన అల్లు శిరీష్

నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేసిన అల్లు శిరీష్

Allu-Sirish-fires-on-Senior-Producerసీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ పై అల్లు శిరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడట ! ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ లో సంచలనం సృష్టిస్తోంది ఎందుకంటే మెగా కాంపౌండ్ కు దగ్గరి నిర్మాత ఈ ఎన్వీ ప్రసాద్ . ఇంతకీ సదరు నిర్మాతపై అల్లు శిరీష్ కు కోపం ఎందుకు వచ్చిందో తెలుసా ……. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి 1971 అనే చిత్రంలో నటించాడు అల్లు శిరీష్ . మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో డిజాస్టర్ అయ్యింది , అయితే అక్కడ విడుదల అవుతున్నప్పుడే తెలుగులో కూడా విడుదల చేయాలనీ భావించారు కానీ కుదరలేదు ఇక రిజల్ట్ కూడా దారుణంగా రావడంతో ఆ సినిమాని మరొక నిర్మాతకు తక్కువ రేటుకే అమ్మాడట !

అయితే తెలుగులో యుద్దభూమి పేరుతో విడుదల అవుతున్న ఈ సినిమా ఒకవేళ తెలుగులో కనుక రిలీజ్ చేస్తే తనకు 15 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా ఇవ్వాలని ముందే షరతు పెట్టాడట ! కానీ ఆ విషయాన్నీ ఎన్వీ ప్రసాద్ మర్చిపోవడంతో అల్లు శిరీష్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసాడట . అదీ విషయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All