Homeటాప్ స్టోరీస్ఫ్యామిలీ‌, స‌న్నిహితుల మ‌ధ్య అల్లు శిరీష్ బ‌ర్త్‌డే!

ఫ్యామిలీ‌, స‌న్నిహితుల మ‌ధ్య అల్లు శిరీష్ బ‌ర్త్‌డే!

ఫ్యామిలీ‌, స‌న్నిహితుల మ‌ధ్య అల్లు శిరీష్ బ‌ర్త్‌డే!
ఫ్యామిలీ‌, స‌న్నిహితుల మ‌ధ్య అల్లు శిరీష్ బ‌ర్త్‌డే!

అల్లు వార‌బ్బాయి అల్లు శిరీష్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా త‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య త‌న పుట్టిన రోజు వేడుక‌ల్ని జ‌రుపుకున్నారు. క‌రోనా వైర‌స్‌, లాక్‌డౌన్ నేప‌థ్యంలో అల్లు శిరీష్ పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా వున్నారు. ఫ్యామిలీ, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేశారు. అల్లు అర్జున్ వైఫ్ స్నేహ‌రెడ్డి స్వ‌యంగా త‌యారు చేసిన కేక్‌ని శిరీష్ క‌ట్ చేసి త‌న పుట్టిన రోజు వేడుక‌ల్ని జ‌రుపుకున్నారు.

ఈ సంద‌ర్భంగా శిరీష్‌కు అల్లు అర్జున్ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. `యూ ఆల్వేస్ బీ మై బెస్ట్ బేబీ ఇన్ దిస్ వ‌ర‌ల్డ్ అంటూ ట్వీట్ చేశారు. ఇక‌పై విభిన్న‌మైన క‌థ‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు అల్లు శిరీష్. ‌కొత్త జంట‌, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, ఒక్క క్ష‌ణం వంటి చిత్రాల్లో న‌టించారు. అయితే ఇటీవ‌ల త‌న కొత్త చిత్రాన్ని మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

- Advertisement -

ఈ నేప‌థ్యంలో అల్లు శిరీష్ త‌దుప‌రి సినిమాపై అభిమానుల్లో ఆస‌క్తినెల‌కొంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న‌తో పాటు మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డించ‌నున్నారు. ఈ ద‌ఫా కొత్త త‌ర‌హా క‌థ‌ని అల్లు శిరీష్ ఎంచుకుంటున్న‌ట్టు  తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All