
అల్లు ఫ్యామిలీ టాలీవుడ్‌లో కొత్త స్టూడియోని నిర్మించబోతోంది. `అల్లు స్టూడియోస్` పేరుతో కొత్తగా స్టూడియోని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్టూడియోని గండిపేట్ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు.
మొత్తం పదెకరాల స్థలాన్ని ఈ స్టూడియో కోసం కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు స్టూడియోస్ వున్న వాటికి ధీటుగా సరికొత్త హంగులతో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి లీసుకొచ్చే స్టూడియోగా దీన్ని తీర్చి దిద్దబోతున్నారు. ఇందు కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. త్వరలోనే ఈ స్టూడియో నిర్మాణం జరగనుందని తెలిసింది.
ఈ స్టూడియోలో అల్లు వారి `ఆహా` ఓటీటీకి సంబంధించిన వెబ్ సిరీస్‌ల నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ప్రత్యేకంగా స్టూడియోలని, షూటింగ్‌ల కోసం ఫ్లోర్‌లని ఏర్పాటు చేయనున్నారట. అంతే కాకుండా భారీ చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం అత్యాధునికిమైన సాంకేతికతని అందుబాటులోకి తీసుకురానున్నారని తెలిసింది.