
మెగాస్టార్ చిరంజీవి వల్ల ఇప్పుడు మెగా ఫ్యామిలీ కి గుర్తింపు వచ్చింది. ఒంటరిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి స్వయంకృషి తో ఎదిగి మెగాస్టార్ గా ఎదిగాడు. ఆయన మాత్రమే కాదు ఆయన వల్ల ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి దాదాపు అరడజను మంది హీరోలుగా రాణిస్తున్నారు. అలాంటి చిరంజీవి కి మాత్రమే చెల్లె మెగాస్టార్ బిరుదు ను కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కు జోడించడం చాలామందికి నచ్చడం లేదు. తాజాగా దీని అల్లు బాబీ స్పందించారు.
తాజాగా అల్లు బాబీ గని మూవీ తో నిర్మాతగా చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లలో మాట్లాడుతూ..మెగాస్టార్ తో అల్లు అర్జున్ ని పోల్చడం సరికాదన్నారు. నేను ఎప్పటికీ చిరంజీవి – అల్లు అర్జున్ లను పోల్చి చూడను. అలా చూడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని మెగాస్టార్ స్థాయికి చేరుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు”
”కానీ బన్నీ అలా కాదు. తన వెనుక మా నాన్న – తాతయ్య ఉన్నారు. అంతేకాదు మా ఫ్యామిలీలో ఎంతోమందికి చిరంజీవి గారు స్ఫూర్తి. బన్నీ కూడా ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మనలో స్ఫూర్తి నింపిన వ్యక్తితో మనల్ని ఎప్పటికీ పోల్చుకోకూడదు” అని అల్లు బాబీ చెప్పుకొచ్చాడు.