Homeగాసిప్స్అప్పుడు పూరీ - ఇప్పుడు త్రివిక్రమ్ 

అప్పుడు పూరీ – ఇప్పుడు త్రివిక్రమ్ 

Allu arjuns History repeats on jan 12th
Allu arjuns History repeats on jan 12th

సరిగ్గా 12 ఏళ్ళ క్రితం జనవరి 12 న రిలీజ్ అయ్యింది ఒక సినిమా. పేరు దేశముదురు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా అది. అంతకుముందు “బన్నీ”  పేరుతో వి.వి. వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక మాస్ సినిమా చేసినా, దేశముదురు లెక్క వేరు. ఆ సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్స్ లు, ఫైట్ లు, పూరీ మార్క్ డైలాగ్స్, హన్సిక అందాలు ఇలా అన్నీ కలిపి ఆ సినిమాను సూపర్ హిట్ చేసాయి.

అల్లు అర్జున్ సినిమా సినిమా కు ఎదుగుతూ కేరళ, కర్ణాటక లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 12వ తేదీన అల.. వైకుంఠ పురం సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. చేసిన ప్రతీ సినిమాలో వైవిధ్యం కోసం తపించే నటుడు అల్లు అర్జున్. ఇక డ్యాన్స్ లలో అయితే అంతర్జాతీయ స్థాయిని తెలుగు తెరకు తీసుకువచ్చాడు. ఇక వేదం లాంటి సినిమాలలో ఒక నటుడిగా ఏంటో పరిణితి చూపించాడు. గతంలో త్రివిక్రమ్ గారితో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేసి ఇప్పుడు హ్యాట్రిక్ టార్గెట్ చేసాడు మన బన్నీ.

- Advertisement -

ఇప్పటికే ఈ సినిమా పాటలు ఆల్ టైం బెస్ట్ సాంగ్స్ అయ్యాయి. ఈ సినిమాలో కూడా, బన్నీ స్టైల్ కి, త్రివిక్రమ్ మార్క్ యాడ్ అయితే ఈ సంక్రాంతి మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All