Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ హీరోయిన్ కావాలంటున్న బన్నీ

బాలీవుడ్ హీరోయిన్ కావాలంటున్న బన్నీ

బాలీవుడ్ హీరోయిన్ కావాలంటున్న బన్నీ
బాలీవుడ్ హీరోయిన్ కావాలంటున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప ది రైజ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అల్లు అర్జున్. దీని చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. పుష్ప పార్ట్ 1 తర్వాత అల్లు అర్జున్ నటించనున్న సినిమా కూడా కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ ను చేయనున్నాడు బన్నీ. దిల్ రాజు ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటీవలే మొదలయ్యాయి. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి కాస్ట్ అండ్ క్రూ ను ఫైనలైజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఐకాన్ కోసం బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని బన్నీ సలహా ఇచ్చాడట. జాన్వీ కపూర్ ప్రస్తుతం మంచి డిమాండ్ మీద ఉంది. ఆమె అయితే బాలీవుడ్ లో కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

జాన్వీ కపూర్ ను టాలీవుడ్ కు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మరి బన్నీ అయినా సక్సెస్ అవుతాడేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All