
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) భారీ అంచనాల మధ్య నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు రాజమౌళి ప్రతిభ ఫై , ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన ఫై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చిత్ర సీమలో అయితే ప్రతి ఒక్కరు సినిమా కు జై జై లు కొడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు , హీరోలు, దర్శకులు , నిర్మాతలు సినిమా ఫై ప్రశంసలు జల్లు కురిపించగా..తాజాగా ఐకాన్ స్టార్ పుష్ప రాజ్ ట్విట్టర్ లో సినిమా ఫై తన స్పందనను తెలిపారు.
‘ఇంత గొప్ప సినిమా అందించినందుకు దర్శక ధీరుడు రాజమౌళికి కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు అల్లు అర్జున్. తన బ్రదర్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని.. ఆయనను చూసి ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు. అలాగే తన బావ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. తారక్ నటనను డైనమిక్ పవర్ హౌస్‌తో పోల్చారు బన్నీ. అలాగే, కీలకమైన పాత్రలు పోషించిన అజయ్ దేవగన్, అలియా భట్ నటనను కూడా ప్రసంశలు కురిపించారు. సంగీత దర్శకుడు కీరవాణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్, నిర్మాత డివివి దానయ్య.. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు అల్లు అర్జున్. ఇండియా గర్వించదగ్గ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇచ్చినందుకు వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.