
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా సైరా గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది తన 12 ఏళ్ల కల. మొత్తానికి మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూనుకోవడంతో సైరా నరసింహారెడ్డి కల నెరవేరింది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలై మంచి టాక్ తో దూసుకెళుతోంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ, విడుదల ముందూ కూడా బోలెడన్ని సమస్యలు ఎదురయ్యాయి. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామన్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా అన్ని కష్టాలనూ దాటుకుని సైరా మొత్తానికి విడుదలై సంచలన విజయం దిశగా దూసుకెళుతోంది. అందుకే ఈ ఆనందాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం ఆస్వాదిస్తోంది.
సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిన్న తిలకించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్.. సైరా టీమ్ కు గురువారం రాత్రి అల్లు అరవింద్ ఇంట్లో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి మెగా హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అక్కినేని అఖిల్, రత్నవేలు, శ్రీకాంత్, సుస్మిత, పరుచూరి బ్రదర్స్, అల్లు శిరీష్, దిల్ రాజు తదితరులు పార్టీలో పాల్గొన్నారు.