Homeటాప్ స్టోరీస్హ్యాట్రిక్ కోసం అతడికి హ్యాండ్ ఇస్తున్నాడా

హ్యాట్రిక్ కోసం అతడికి హ్యాండ్ ఇస్తున్నాడా

Allu arjun teamup once again trivikramనా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఘోర పరాజయం పొందడంతో తదుపరి సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్ . అయితే మనం వంటి విభిన్న కథా చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని చాలాకాలంగా అంటున్నారు కానీ అది మాత్రం వర్కౌట్ కావడం లేదు . విక్రమ్ కథ చెబుతున్నాడు బన్నీ మార్పులు చెబుతున్నాడు అలా సీరియల్ లా ఆ వ్యవహారం సాగుతోంది తప్ప కొలిక్కి మాత్రం రావడం లేదు . దాంతో ఇక విక్రమ్ కుమార్ కు అల్లు అర్జున్ హ్యాండ్ ఇచ్చినట్లే అని అంటున్నారు .

ఎందుకంటే త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు అల్లు అర్జున్ . ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది . మరో రెండు వారాలు ఓపిక పడితే అరవింద సమేత రిలీజ్ అవుతుంది ఫలితం కూడా వస్తుంది కాబట్టి త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ ఉత్సాహపడుతున్నాడట అల్లు అర్జున్ . ఇంతకుముందు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి . జులాయి పెద్ద హిట్ కాగా సన్నాఫ్ సత్యమూర్తి కూడా మంచి విజయాన్నే అందుకుంది దాంతో హ్యాట్రిక్ కోసం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ట్రై చేస్తున్నారు .

- Advertisement -

English Title: Allu arjun team up once again trivikram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All