Homeగాసిప్స్దేవి-సుకుమార్: పాటల్లో కోత పెట్టేసారుగా

దేవి-సుకుమార్: పాటల్లో కోత పెట్టేసారుగా

దేవి-సుకుమార్: పాటల్లో కోత పెట్టేసారుగా
దేవి-సుకుమార్: పాటల్లో కోత పెట్టేసారుగా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలతో సినిమాకు బోలెడంత హైప్ వచ్చింది. విడుదలైన మూడు పాటల్లో రెండు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుని టాప్ లో ట్రెండ్ అయ్యాయి. సామజవరగమన పాట 100 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతుంటే, రాములో రాముల సైతం 90 మిలియన్ వ్యూస్ సాధించింది.

ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో తర్వాత సుకుమార్ తో సినిమా చేయనున్న విషయం తెల్సిందే. కొన్ని వారాల క్రితం ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ కూడా చేసారు. ముందు అనుకున్న దాని ప్రకారమైతే బన్నీ – సుకుమార్ ప్రాజెక్ట్ నవంబర్ నుండే షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేసారు. అల వైకుంఠపురములో షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసుకోవాలి. అయితే డిసెంబర్ వచ్చేసినా ఇంకా షూటింగ్ అవ్వలేదు. మరికొన్ని రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసాక తర్వాత రిలీజ్ హంగామా ఉండనుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ – సుకుమార్ ప్రాజెక్ట్ జనవరి చివరి వారం నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశముంది.

- Advertisement -

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న విషయం తెల్సిందే. మాములుగా ఇప్పుడు దేవి పరిస్థితి అంత బాలేదు. అతనితో పని చేసే దర్శకులు కూడా దూరం జరుగుతూ వస్తున్నారు. పాటల క్వాలిటీ విషయంలో దేవి ఎక్కడో రాజీ పడుతున్నాడన్న కారణంగా చాలా మంది దర్శకులు వేరే వారివైపు చూస్తున్నారు. అయితే సుకుమార్ మాత్రం దేవిని వదల్లేదు. బన్నీతో సినిమాకు కూడా దేవినే సంగీత దర్శకుడు. అయితే ఈ చిత్రంలో సాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించే విధంగా 5 లేదా 6 పాటలు ఉండవట. కేవలం మూడు పాటలే ఉంటాయని చెబుతున్నారు. అందులో ఒకటి బన్నీ ఇంట్రడక్షన్ సాంగ్, హీరో – హీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్ ఒకటి, ఇక మూడోది ఫోక్ నెంబర్ గా చెబుతున్నారు. అయితే పాటలు మూడే ఉన్నా రీ రికార్డింగ్ కు అధికమైన ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఇంటెన్స్ ఉన్న సీన్లు అధికంగా ఉండనున్నాయి. దాంతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మరి దేవి అటు మూడు పాటలను – ఇటు రీ రికార్డింగ్ కు అవుట్ స్టాండింగ్ ఔట్పుట్ ఇస్తేనే సుకుమార్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిన వాడవుతాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All