Homeటాప్ స్టోరీస్సామాన్యుడిగా సూపర్ మార్కెట్ కి వెళ్ళిన స్టైలిష్ స్టార్

సామాన్యుడిగా సూపర్ మార్కెట్ కి వెళ్ళిన స్టైలిష్ స్టార్

సామాన్యుడిగా సూపర్ మార్కెట్ కి వెళ్ళిన స్టైలిష్ స్టార్
సామాన్యుడిగా సూపర్ మార్కెట్ కి వెళ్ళిన స్టైలిష్ స్టార్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ పాటిస్తున్ననేపధ్యంలో ఎప్పుడూ చుట్టూ వందల మందితో సందడిగా షూటింగ్ లు చేసుకునే మన సినీ తారలు కూడా ఇంటికి పరిమితం అయ్యారు. ఇక ఇంట్లో ఉండటం అంటే… ఇంట్లో ఉండే పనులు కూడా చూసుకోవాలి కదా..!. ఇప్పటికే పలు సినిమా స్టార్స్ తాము ఉంట్లో ఉండి ఎలా టైం పాస్ చేస్తున్నామో..? సోషల్ మీడియా వేదికలపై అభిమానులతో ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.

ఇక తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇలా ఒక సూపర్ మార్కెట్ లో సామాన్యుడిలాగా నిత్యవసర వస్తువులు షాపింగ్ చేస్తూ కెమేరా కు చిక్కారు. బన్నీ సార్ మొదటినుండి కూడా స్టార్ స్టేటస్ కు చాలా దూరం. అభిమానుల మధ్యకు వచ్చినప్పుడు తప్ప మామూలు సమయాల్లో తన సిబ్బందితో కూడా ఒక స్నేహితుడి మాదిరి కలిసిపోతారు అని ఇప్పటికే మనకు తెలుసు.

- Advertisement -

మనుషులు అందరం ఒకేలా ప్రవర్తించాలి..! మన పేరు, పలుకుబడి, హోదా ప్రతిసారీ చూపించకూడదు అనేది బన్నీ సార్ ఫిలాసఫీ. ఇక అలాంటి కాన్సెప్ట్ తో అంతకుముందు ఏకంగా డైరెక్టర్ సుకుమార్ తో “ఐ యామ్ డట్ చేంజ్”  అనే షార్ట్ ఫిలిం కూడా చేసారు. ఇక ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ అందరూ మా హీరో వెరీ సింపుల్ & స్వీట్ అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All