Homeఎక్స్ క్లూసివ్వెనక్కితగ్గేది లేదంటున్న అల్లు అర్జున్

వెనక్కితగ్గేది లేదంటున్న అల్లు అర్జున్

మహేష్ బాబు తో తలపడటమే తప్ప వెనక్కి తగ్గేది లేదని ఏప్రిల్ 27 న అమీ తుమీ తేల్చుకోవడం ఖాయమని అంటున్నాడు అల్లు అర్జున్ . వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ” నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ”. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు అయితే ఆ తర్వాత కొద్దిరోజులకు మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న భరత్ అనే నేను చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు . దాంతో రెండు భారీ చిత్రాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది . 
 
అయితే నిన్న మొన్న వినిపించిన కథనం ప్రకారం అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని ఏప్రిల్ 27న కాకుండా వారం , పది రోజుల ముందుగానే రిలీజ్ చేయనున్నారు అని వినబడింది . కట్ చేస్తే నిన్న సాయంత్రం అల్లు అర్జున్ మీడియా తో సమావేశమై మా సినిమా విడుదల లో ఎలాంటి మార్పులు లేవు ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నామని స్పష్టం చేసాడు . రెండు భారీ చిత్రాలు అందునా రెండింటి పైన భారీగా అంచనాలు ఉన్న చిత్రాలు కావడంతో వార్ మామూలుగానైతే ఉండదు . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All