Homeటాప్ స్టోరీస్పుష్ప నుండి సామీ సాంగ్ ప్రోమో.. అదుర్స్..!

పుష్ప నుండి సామీ సాంగ్ ప్రోమో.. అదుర్స్..!

Allu Arjun Pushpa Saami Song Promo Released

సుకుమార్ టేకింగ్.. అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రమే కాదు వీరికి పోటీగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా పుష్పకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ రిలీజైన రెండు సాంగ్స్ దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి సాంగ్స్ తో ఆ విషయం అర్ధం కాగా ఇప్పుడు సినిమా నుండి థర్డ్ సాంగ్ ఊర మాస్ సాంగ్ ను వదిలి మరింత ఊపు వచ్చేలా చేశాడు డి.ఎస్.పి. సామీ సామీ అంటూ రికార్డులను చెడుగులు ఆడటం లో తగ్గేదిలే అనిపించేలా ఈ సాంగ్ ఉంది. ఖచ్చితంగా థియేటర్ లో ఈ సామీ సాంగ్ సీటీమార్ కొట్టేలా ఉంటుందని చెప్పొచ్చు.

- Advertisement -

కథ, కథనాలతో పాటుగా ఆడియెన్స్ కు ఊపొచ్చే సాంగ్స్ కూడా పుష్ప సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. అల్లు అర్జున్ లాంటి డ్యాన్సర్ కు దేవి శ్రీ పాటలు తోడైతే ఇక అదరగొట్టేయడమే. ముఖ్యంగా సామి సాంగ్ మాత్రం మాంచి మాస్ బీట్ లా ఉందని చెప్పొచ్చు. జస్ట్ 30 సెకన్ల ప్రోమోతోనే దేవి పిచ్చెక్కించేశాడు అంటే ఇక డిసెంబర్ 28 న ఉదయం 11:07 గంటలకు రిలీజ్ అయ్యే సామీ ఫుల్ సాంగ్ తో రీ సౌండ్ అదిరిపోయేలా ఉంటుందని చెప్పొచ్చు.

పుష్ప ది రైజ్ మొదటి పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటిస్తుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All