
అల్లు అర్జున్ అంటే టాలీవుడ్‌లో స్టైల్‌కి ఐకాన్.. అయితే `పుష్ప` కోసం ఆ ట్యాగ్‌ని పక్కన పెట్టి ఊర మాస్ పాత్రలో దర్శనమిస్తున్నాడు. బన్నీ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో జరుగుతోంది. గత ఏడు నెలలుగా లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. అల్లు అర్జున్ మారేడుమిల్లి అడవుల్లోకి వెళుతున్న ఓ ఫొటోని షూట్ ప్రారంభమైన సందర్భంగా చిత్ర బృందం షేర్ చేసింది.
మాసిన షర్ట్ .. చేతికి 80ల కాలం నాటి వాచ్..వేలికి సిల్వర్ రింగ్..తో బన్నీ పుష్పరాజ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడా అనేంతగా ఆయన మేకోవర్ కనిపించింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా బన్నీ సెట్‌లో సందడి చేస్తున్న ఓ ఫొటో బయటికి వచ్చేసింది. షాట్ గ్యాప్‌లో తన వ్యక్తిగత సిబ్బందితో వున్న బన్నీ ఫొటో ఆయన అభిమానులకే కాదు ఆడియన్స్‌కి కూడా షాకిస్తోంది. ఈ ఫొటోలో బన్నీ రగ్గ్‌డ్ లుక్‌లో మాసిన గడ్డం.. మట్టి కొట్టుకు పోయిన డ్రెస్‌లో కనిపిస్తుండటంతో ఈ ఫొటోలో వుంది బన్నీ యేనా అని అవాక్కవుతున్నారు. తన స్టైల్స్‌ని పక్కన పెట్టి పూర్తిగా పుష్పరాజ్ పాత్రలో బన్నీ లీనమైనట్టుగా ఈ లుక్‌ని బట్టి తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ లారీడ్రైవర్‌గా ఊరమాస్ పాత్రలో క్యారెక్టర్‌లో నటిస్తున్నారు.