Homeగాసిప్స్వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన బన్నీ

వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన బన్నీ

వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన బన్నీ
వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్లాప్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అర్ధం కాక దాదాపు ఏడాది పాటు కాలం గడిపేసిన అల్లు అర్జున్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో షూటింగ్ ముగించుకుని రిలీజ్ సన్నాహకాల్లో ఉంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెల్సిందే. అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇప్పటికే సుకుమార్ సినిమాను ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే 2020లో అల్లు అర్జున్ వి రెండు సినిమాలు విడుదల కావడం ఖాయం.

2019లో అల్లు అర్జున్ ది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అందుకే తన ఫ్యాన్స్ కు బన్నీ ఇలా 2020లో డబల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రెండు సినిమాలే కాక బన్నీ మరో మూడు సినిమాలను ఓకే చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సుకుమార్ ది అల్లు అర్జున్ కెరీర్ లో 20వ సినిమా. ఇది కాకుండా 21, 22, 23వ సినిమాలు కూడా బన్నీ సెట్ చేసేసాడు. ఈ సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఆయా సమయాల్లో జరిగేలా అల్లు అర్జున్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.

- Advertisement -

ముందుగా అల్లు అర్జున్ సుకుమార్ సినిమా పూర్తవ్వగానే ముందుగా కమిట్ అయిన ప్రకారం వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను చేయనున్నాడు. దాని తర్వాత మురుగదాస్ తో తెలుగు – తమిళ ద్విభాషా చిత్రం ఉండనుంది. ఇక కొరటాల శివతో కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఇద్దరి మధ్య దీనికి సంబంధించిన చర్చలు నడిచినట్లు తెలుస్తోంది. ఇలా 2020 నుండి అల్లు అర్జున్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్ళబోతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All