Homeగాసిప్స్బోయపాటిని బ్యాకప్ ఆప్షన్ గా పెట్టుకున్న అల్లు అర్జున్

బోయపాటిని బ్యాకప్ ఆప్షన్ గా పెట్టుకున్న అల్లు అర్జున్

బోయపాటిని బ్యాకప్ ఆప్షన్ గా పెట్టుకున్న అల్లు అర్జున్
బోయపాటిని బ్యాకప్ ఆప్షన్ గా పెట్టుకున్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రైజ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. పుష్పను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని ఈ క్రిస్మస్ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి రెండో చిత్రం చిత్రీకరణ మొదలు అవుతుంది. పుష్ప రెండు భాగాల మధ్య అల్లు అర్జున్ మరో సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడు.

వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించి ఏళ్ళు గడుస్తోంది. పుష్ప 1 తర్వాత ఐకాన్ ను మొదలుపెడతాడని అనుకున్నా ఇప్పుడు వేరే వార్త కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఐకాన్ ఆలస్యమైతే అల్లు అర్జున్, బోయపాటి శ్రీనుతో వర్క్ చేయాలని అనుకుంటున్నాడట.

- Advertisement -

సరైనోడు చిత్రం ద్వారా వీరిద్దరూ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించారు. ప్రస్తుతం అఖండ చిత్రంతో బిజీగా ఉన్న బోయపాటి తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం పలు స్క్రిప్ట్స్ ను సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో అల్లు అర్జున్ కు చెప్పిన స్క్రిప్ట్ కూడా ఒకటి. చూడాలి మరి ఇది ఎంత వరకూ కార్యరూపం దాలుస్తుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All