Homeటాప్ స్టోరీస్సుకుమార్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన బన్నీ

సుకుమార్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన బన్నీ

సుకుమార్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన బన్నీ
సుకుమార్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఆనందంలో తేలిపోతున్నాడు. తాను ఎంతగానో నమ్మి చేసిన చిత్రం అల వైకుంఠపురములో సూపర్ సక్సెస్ సాధించడంతో సూపర్ హ్యాపీగా ఉన్నాడు. నిజానికి అల వైకుంఠపురములో షూటింగ్ మొదలుపెడుతున్నప్పుడు ఎవరికీ ఇంత పెద్ద హిట్ అవుతుందన్న అంచనాలు లేవు. నా పేరు సూర్య తర్వాత తనకు కావాల్సిన సినిమా కోసం ఏడాది పాటు వెయిట్ చేస్తుంటే బన్నీ తప్పు చేస్తున్నాడనే అందరూ అన్నారు. అయితే ఒక లైట్ హార్ట్డ్ సినిమా చేయాలని భావించిన బన్నీ, త్రివిక్రమ్ తో దగ్గరుండి ఈ స్క్రిప్ట్ రాయించుకున్నాడు. అల వైకుంఠపురములో చిత్రానికి క్రియేటివ్ ఇన్పుట్స్ విషయంలో బన్నీ ప్రమేయం ఎంతో ఉందనేది కాదనలేని విషయం.

ఈ సంగతిని స్వయంగా త్రివిక్రమ్ కూడా ఒప్పుకున్నాడు. మ్యూజికల్ వీడియోస్ చేసి రిలీజ్ చేయడం దగ్గరనుండి చాలా విషయాల్లో బన్నీ ఇచ్చిన సలహాలు పనిచేసాయి. సినిమా హిట్ అవ్వడంతో పాటు తన ఇన్పుట్స్ పనిచేయడంతో బన్నీ కాన్ఫిడెన్స్ రెట్టింపైంది. అయితే సుకుమార్ సినిమా విషయంలో మాత్రం బన్నీ కలగజేసుకోడట.

- Advertisement -

అల వైకుంఠపురములో రిలీజ్ కు ముందే సుకుమార్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి సమ్మర్ కు రిలీజ్ చేద్దామని భావించాడు బన్నీ. అప్పట్లో ఈ మేరకు సుకుమార్ పై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అల వైకుంఠపురములో షూటింగ్ లో జాప్యం జరగడం, సినిమా బంపర్ హిట్ అవ్వడంతో బన్నీ ఇప్పుడు చాలా కూల్ గా ఉన్నాడు. సుకుమార్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్ విషయంలో కూడా తొందరపెట్టకుండా సుకుమార్ ను వదిలేయాలని డిసైడ్ అయ్యారు. స్వతహాగా స్లో గా సినిమాలు తీసే సుకుమార్ ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ అయినట్లు సమాచారం. ఎక్కువ టైం దొరకడంతో వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ కూడా ఫిబ్రవరి నుండి మార్చ్ ను మారినట్లుగా సమాచారం. మరి ఈసారి బన్నీ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All