Homeటాప్ స్టోరీస్బన్నీ కొత్త ఆఫీస్ వెనుక సీక్రెట్ అదే!

బన్నీ కొత్త ఆఫీస్ వెనుక సీక్రెట్ అదే!

Allu Arjun explains reason behind his new office
Allu Arjun explains reason behind his new office

ఒక్కోసారి మనం ఏంటేంటో అనుకుని ఊహించేసుకున్న విషయాల వెనుక చాలా సిల్లీ రీజన్స్ దాగుంటాయి. అలాంటిదే ఒకటి బన్నీ విషయంలో బయటపడింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే విడుదలైన అల వైకుంఠపురములో చిత్రంతో మరుపురాని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సరైనోడు చిత్రాన్ని అలవోకగా అధిగమించేలా కనిపిస్తోంది అల వైకుంఠపురములో. వారం రోజుల్లోపే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరుకోనుండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే అల వైకుంఠపురములో బిజినెస్ దాదాపు 90 కోట్లు చేసింది. మార్కెట్ పరంగా బన్నీ ఆ రేంజ్ కు ఇంకా రాలేదు. అందుకే అల వైకుంఠపురములో విషయంలో ట్రేడ్ కూడా ఉత్కంఠగా ఎదురుచూసింది. కానీ బన్నీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఇక అసలు విషయానికొస్తే.. బన్నీ ఆ మధ్య కొత్త ఆఫీస్ ఒకటి తీసుకున్న విషయం తెల్సిందే. అప్పట్లో అది హాట్ టాపిక్ అయింది. తనకి గీతా ఆర్ట్స్ ఉన్నా కానీ ఇలా కొత్త ఆఫీస్ తీసుకోవాల్సిన అవసరమేమొచ్చిందని వార్తలు మొదలయ్యాయి. మిగతా హీరోల్లాగే అల్లు అర్జున్ కూడా కొత్త నిర్మాణ సంస్థ నెలకొల్పనున్నాడని, అందుకనే ఈ కొత్త ఆఫీస్ అని కూడా అన్నారు. ఇంకొందరైతే ఏకంగా తండ్రితో బన్నీకి అభిప్రాయ బేధాలు వచ్చాయని ఇకపై గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేయబోడని, తన కొత్త నిర్మాణ సంస్థలో సినిమాల నిర్మాణ భాగస్వామ్యం ఉంటుందని అన్నారు.

- Advertisement -

అయితే అలాంటిదేం జరగలేదు. అల వైకుంఠపురములో చిత్రానికి గీతా ఆర్ట్స్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంది. మరెందుకీ కొత్త ఆఫీస్ అని అంటే బన్నీ నవ్వేసి ఆ రూమర్స్ తన దాకా కూడా వచ్చాయని, అయితే గీతా ఆర్ట్స్ లో సినిమా నిర్మాణం పెరిగింది. కొన్ని సినిమాల టీమ్స్ 24 గంటలూ అక్కడ పని చేస్తున్నాయి. దాంతో నాకు ప్రైవసీ ఉండట్లేదు. అందుకనే ఈ కొత్త ఆఫీస్ అని చెప్పాడు. అదన్నమాట సంగతి. ఏదేదో ఊహించేసుకుంటే, విషయం మాత్రం చాలా సింపుల్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All