
పుష్ప మూవీ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..తాజాగా కెజిఎఫ్ 2 మూవీ ఫై ప్రశంసల జల్లు కురిపించారు. యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన కెజియఫ్ 2 సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకొని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. యశ్ యాక్షన్ .. ప్రశాంత్ నీల్ టేకింగ్, ఆసక్తిని రేకెత్తించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , భారీ తారాగణం ఇవ్వన్నీ కూడా సినిమా విజయంలో భాగమయ్యాయి. ఇక ఈ మూవీ ఫై ఇప్పటికే అనేక మంది సినీ స్టార్స్ తమ స్పందనను తెలియజేయగా, తాజాగా అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేసారు.
‘కెజీఎఫ్ 2′ కు అభినందనలు. స్వాగర్ ఇంటెన్సిటీ పర్ఫార్మెన్స్ ని యష్ ఇచ్చారు. అంతే కాకుండా ఈ మూవీలోని కీలక పాత్రల్లో నటించిన సంజయ్ దత్ గారు రవీనా టాండన్ గారు అద్భుతంగా నటించారు. రవి బాస్రూర్ బీజీఎమ్స్ భువన్ గౌడ ఔట్ స్టాండింగ్ విజువల్స్ ని అందించిన ప్రతీ ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవిస్తున్నాను. ప్రశాంత్ నీల్ స్పెక్టాకులర్ షో ఇది. ఆయన విజన్ ని కన్విక్షన్ ని గౌరవిస్తున్నాను. ఈ సినిమాతో ది గ్రేట్ సినిమాటిక్ అనుభూతిని అందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.