Homeగాసిప్స్సుకుమార్ కు కండిషన్ పెట్టి సినిమా చేయడానికి ఒప్పుకున్న బన్నీ

సుకుమార్ కు కండిషన్ పెట్టి సినిమా చేయడానికి ఒప్పుకున్న బన్నీ

సుకుమార్ కు కండిషన్ పెట్టి సినిమా చేయడానికి ఒప్పుకున్న బన్నీ
సుకుమార్ కు కండిషన్ పెట్టి సినిమా చేయడానికి ఒప్పుకున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో షూటింగ్ మొదలైన సమయంలోనే మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసాడు. అందులో ఒకటి సుకుమార్ తో సినిమా కాగా, మరొకటి దిల్ రాజు క్యాంప్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తో సినిమా. అయితే ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పుడు మొదలవుతాయనేది ఏం చెప్పలేదు బన్నీ. ఆ ప్రకటన చేసాక మళ్ళీ అల వైకుంఠపురములో షూటింగ్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల పెట్టుకోవడంతో షూటింగ్ ఆలస్యం కాకూడదని వరస షెడ్యూల్స్ లో సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలనుకున్నాడు. అనుకున్న ప్రకారమే చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటల పుణ్యమాని అల వైకుంఠపురములో చిత్రానికి సూపర్ హైప్ వచ్చేసింది. ఇప్పుడు సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ అల వైకుంఠపురములోనే. అంతలా ఈ చిత్రం మీద క్రేజ్ ఏర్పడింది.

మరోవైపు తన రెండు సినిమాలలో ముందు ఏది మొదలుపెట్టాలని సందిగ్దత బన్నీని చాలా కాలం వెంటాడింది. ఒక స్టేజ్ లో ముందు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయాల్సిన ఐకాన్ ను చేద్దామని ఫిక్స్ అయ్యాడు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తీసిన సుకుమార్ సినిమాను కాదని వేణు శ్రీరామ్ కథను ముందు ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాడోనని ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమన్నాయి. సుకుమార్ సినిమాకు బన్నీ చాలా కరెక్షన్స్ చెప్పడానికి వాటిని సుకుమార్ ఛేంజ్ చేయడానికి సమయం పడుతుందని, అందుకే ముందు ఐకాన్ ను మొదలుపెడతాడని కూడా అన్నారు. అయితే ఉన్న రూమర్స్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ నిన్న బన్నీ – సుకుమార్ సినిమాకు పూజ కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే షూటింగ్ కూడా మొదలైపోతుందని అంటున్నారు. మొన్నటి దాకా అటూ ఇటూ ఊగిన బన్నీ ఇప్పుడెందుకు సడెన్ గా సుకుమార్ కు పచ్చ జెండా ఊపేసాడని అర్ధం కాలేదు. అయితే దీని వెనుక పెద్ద మతలబే ఉంది.

- Advertisement -

సుకుమార్ సినిమాను ఒప్పుకోవడానికి బన్నీ ఒక కండిషన్ పెట్టాడట. ఎట్టి పరిస్థితులలోనూ సమ్మర్ కు సినిమాను రిలీజ్ చేయాలని అంటున్నాడట. నిజానికి నా పేరు సూర్య ముందు వరకూ బన్నీ సినిమాలు సమ్మర్ కే విడుదలయ్యేవి. అయితే నా పేరు సూర్య తర్వాత కొంత బ్రేక్ రావడం, త్రివిక్రమ్ సినిమా కూడా ఆలస్యంగా మొదలుకావడంతో అల వైకుంఠపురములో ఇప్పుడు సంక్రాంతికి షిఫ్ట్ అయింది. అందుకే ఈసారి సమ్మర్ ను మిస్ అవ్వకూడదని అంటున్నాడు బన్నీ. వరస షెడ్యూల్స్ వేసుకుని ఈ చిత్ర షూటింగ్ ను వీలైనంత తొందర్లో పూర్తి చేయాలంటున్నాడు బన్నీ. ఇదంతా బానే ఉంది కానీ సుకుమార్ ఎలాంటి దర్శకుడో అందరికీ తెలుసు. షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకునే దర్శకులలో రాజమౌళి తర్వాత సుకుమార్ నెంబర్ 1. లేట్ అయినా పర్వాలేదు, రీ షూట్స్ జరిగినా ఓకే కానీ సీన్ విషయంలో కాంప్రమైజ్ కాడు సుకుమార్. అలా అని షెడ్యూల్ ప్రకారం త్వరగా సినిమాను షూట్ చేయలేడు. మరి ఇలాంటి సుకుమార్ ఇంత తక్కువ సమయంలో బన్నీతో సినిమాను పూర్తి చేయగలడా అన్నది సందేహమే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All