Homeగాసిప్స్సరైనోడు 2 సర్వం సిద్ధం..!

సరైనోడు 2 సర్వం సిద్ధం..!

Allu Arjun Boyapati Srinu Sarainodu 2 is on Cards

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాల ప్లానింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత వేణు శ్రీరాం తో ఐకాన్ మూవీ చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమాతో పాటుగా టాలీవుడ్ మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో కూడా ఒక సినిమా ఉంటుందని టాక్. బోయపాటి, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఇదివరకు సరైనోడు సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో మళ్లీ ఈ కాంబో రిపీట్ చేయాలని చూస్తున్నారు.

- Advertisement -

గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే బోయపాటి, అల్లు అర్జున్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా సరైనోడు 2 అవుతుందా లేక మరో కథతో వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కథ ఏదైనా సరైనోడు సూపర్ హిట్ కాబట్టి ఈ ఇద్దరు చేసే సినిమాకు సరైనోడు 2 అనే టైటిల్ అయితేనే ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారని కొందరి మాట.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 మాత్రమే షూటింగ్ పూర్తి చేశాడు. ఈ పార్ట్ తర్వాత రెండో పార్ట్ షూటింగ్ ఉంది.. ఆ తర్వాత ఐకాన్ చేయాల్సి ఉంది. అప్పుడు బోయపాటి శ్రీను సినిమా లైన్ లోకి వస్తుంది. బోయపాటితో పాటుగా మారుతి కూడా బన్నీతో సినిమా కోసం కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All