ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 40 బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా ఉదయం నుండి అభిమానులు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ కు బర్త్ డే విషెష్ అందజేస్తూ వారి అభిమానాన్ని , ప్రేమను చాటుకుంటూ వస్తున్నారు. ఇక ఈసారి తన బర్త్ డే వేడుకలను సెర్బియా లో గ్రాండ్ గా జరుపుకున్నారు. తన భార్యా పిల్లలు మరియు సన్నిహితులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. దీనికి సంబదించిన ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు చెబుతూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు.”అందరికీ నమస్కారం!.. ముందుగా మీ అందరి శుభాకాంక్షలకు నేను అందరికీ థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రేమ ఆశీస్సులే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఈ 40 ఏళ్ల వయస్సులో నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నా తల్లిదండ్రులు కుటుంబం స్నేహితులు ఉపాధ్యాయులు శ్రేయోభిలాషులు నా ఫిలిం ఇండస్ట్రీ నా ప్రేక్షకులు నా లవ్లీ స్పెషల్ ఫ్యాన్స్ మరియు నాపై అంతులేని ప్రేమను కురిపించిన వ్యక్తులందరి వల్ల నేను ఇలా ఉన్నాను”, ”నా జీవితాన్ని తాకిన ప్రతి అనుభవానికి ఎనలేని కృతజ్ఞతలు. ఈ అందమైన అనుభవంలో భాగమైనందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వినయపూర్వకంగా… అనంతమైన కృతజ్ఞతతో.. ధన్యవాదాలు” అని అల్లు అర్జున్ నోట్ లో పేర్కొన్నారు.